రాజమహేంద్రవరం (Rajahmundry) నగరం, గోదావరి తీరంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రముఖ పట్టణంగా నిలిచినది. ఇప్పుడు అదే గోదావరి తీరం మీదుగా, పర్యాటక రంగానికి గల అపారమైన అవకాశాలను వినియోగించుకోవడం లక్ష్యంగా “అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు” (Akhanda Godavari Tourism Project) రూపుదిద్దుకుంటోంది.

ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జూన్ 19న జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వెల్లడించారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు ఎంపీ పురందేశ్వరి హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇచ్చే ప్రాధాన్యత స్పష్టమవుతోంది.
రాజమహేంద్రవరం – పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం, గోదావరి పరివాహక ప్రాంతాల పర్యాటక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ప్రాజెక్టు పూర్తయిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు.
చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఊతం
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాంతీయ చరిత్ర, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అభివృద్ధి పనులు సాగనున్నాయి. చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన ఇందులో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్ఠాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతు
ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టబడుతోంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి వెల్లడించారు. పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
గోదావరి పుష్కరాల నాటికి పూర్తి లక్ష్యం
ప్రాజెక్టు పనులన్నీ గోదావరి పుష్కరాలకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతవరకు ప్రధాన నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక సేవల సదుపాయాల ఏర్పాట్లన్నీ ముగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది. పుష్కరాల నాటికి ఈ ప్రాంతం పర్యాటకంగా పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షించే విధంగా మారే అవకాశం ఉంది.
Read also: Google: అమరావతిలో గూగుల్ ప్రాజెక్టుకు ఉన్నతస్థాయి చర్చలు