ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతుండగా, వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు ఆగే సూచనలు లేవని తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ అంచనా వేసింది.
Pooran Kumar: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసుపై రేవంత్ రెడ్డి స్పందన
అలానే పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) (APSDAM) ప్రకటించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది. దీని ప్రకారం చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. నేడు అనగా ఆదివారం నాడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
దీని ప్రకారం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. అలానే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.అలానే నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దీనిలో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని… అలానే కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఏనీ వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటుగా.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆకస్మాత్తుగా ఉరుములు
ఇక, దక్షిణ కోస్తాలో కూడా పపలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడమే కాక.. కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన వాన పడుతుందని పేర్కొంది. ఇదే కాక రాయలసీమ (Rayalaseema) లోని పలు ప్రాంతాల్లో కూడా ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.రాగల మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో వ్యవసాయ పనులకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: