నెల్లూరు కలెక్టరేట్ : దిత్వా ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షం (Heavy rain) పడింది. దీంతో ఎటుచూసినా నగరం మొత్తం జలమయం అయిపోయింది. ఇప్పటికే 2 రోజులు నుండి కురుస్తున్న వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వగా గురువారం ఉదయం పడిన వర్షానికి వాగులు మొత్తం పొంగిపోయాయి. ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న అధికారులు ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఉన్నారు. గత రెండు రోజులు నుండి ఎడతెరపి లేకుండా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేటు, రామలింగాపురం, మాగుంట లేఔట్ నందు నిలిచిన వర్షపు నీరును ఎప్పటికీ అప్పుడు యుద్ధ ప్రాతిపదికన మోటార్ల సహాయంతో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించి వాహన చోదకులకు, ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read also: K. Vijayanand: ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

Torrential rain in Nellore district
ఇలాగే మరో రెండు రోజులు వర్షం పడితే
దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరం, గ్రామీణంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు నిండి జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నెల్లూరులోని పేరారెడ్డిపల్లి, బీసీ కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వాళ్లని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇలాగే మరో రెండు రోజులు వర్షం పడితే జిల్లాకు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు అప్రమతం అవ్వడంతో నెల్లూరులో కమిషనర్ నందన్ ఎప్పటికప్పుడు జిల్లా అధికార బృందంతో పర్యటిస్తూ ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: