వాతావరణశాఖ తాజా అప్‌డేట్‌లో రాష్ట్రాల కోసం కీలక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మాత్రమే కాదు, సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తదుపరి 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Rain Alert) పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల అంచనా
ఏపీలో వచ్చే మూడు రోజులలో భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. సోమవారం వాయువ్య బంగాళాఖాతం (Northwest Bay of Bengal)లో ఏర్పడే అల్పపీడనం, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సంబంధించిన పరిస్థితులు వర్షాలను ప్రేరేపిస్తాయి. ఇక చత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ రెండు అల్పపీడనాల కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది, బికనేర్ నుంచి కళింగపట్నం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వివరించారు.
కోస్తా మరియు రాయలసీమకు వర్షాల ప్రభావం
ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తా ప్రాంతంలో చెదురు మదురు నుండి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఎల్లుండి మంగళవారం వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
ప్రత్యేకంగా ప్రభావిత జిల్లాలు:
- భారీ వర్షాలు: అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ
- మోస్తారు నుంచి భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి
- తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు: మిగతా జిల్లాలు
తెలంగాణలో వర్షాల పరిస్థితి
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు రాష్ట్రంలోని జిల్లాలకు మూడు రకాల అలర్ట్‌లు జారీ చేశారు. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు,వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: