हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Sharanya
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల గత వారం రోజుల నుండి ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బాంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం ఏర్పడింది. ఈశాన్య అరేబియన్ (Northeast Arabian) సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశముంది.

నేడు తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే నేడు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో ఈరోజు మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది.

ఆంధ్రలో కూడా భారీ వర్షాలు..మత్స్యకారులకు సూచనలు

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు గట్టిగా హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. ఈ వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Narla Srividya: మావోయిస్టు కీలక నేత నార్ల శ్రీవిద్య అరెస్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870