బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయి. ఉపరితల ఆవర్తనానికి తోడు ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో, కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీకి ఆరెంజ్ & ఎల్లో అలర్ట్‌లు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో శనివారం అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్ష సూచనలు
తెలంగాణ(Telangana)లో శని, ఆదివారం, సోమవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది:
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ ,మంచిర్యాల ,జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్,మహబూబ్ నగర్.
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:
- నిర్మల్
- నిజామాబాద్
- మెదక్
- కామారెడ్డి
- సంగారెడ్డి
హైదరాబాద్‌లో భారీ గాలుల ప్రభావం
హైదరాబాద్‌లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, రహదారి రవాణా, విద్యుత్ సరఫరా, నీటి ప్రవాహం వంటి అంశాల్లో అంతరాయం కలగవచ్చని వాతావరణ శాఖ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: