Rain Alert: తుపాను తీరం దాటిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు చాలా కీలకం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి 11,347 స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు రెడీ చేశాం. సైక్లోన్ (cyclone) డైరెక్షన్ ను బట్టి సేవలందించేందుకు 772 రిస్టోరేషన్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచాం. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 7,289 జేసీబీ, క్రేన్స్, వాహనాలు సిద్ధంగా ఉంచాం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కాగా చర్యలు చేపట్టి 1,037 డీజిల్ జనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించాం. ఎయిర్ టెల్, జియో, ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెల్ ఫోన్ టవర్లకు అవసరమైన డీజి సెట్లు సిద్ధం చేశారు, డీజిల్ కూడా అందుబాటులో ఉంచాం.
Read also: Weather Red Alert : మోంతా తుపాను దెబ్బకు ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు

Rain Alert: సహాయ చర్యలపై ముందస్తు ఏర్పాట్లు
Rain Alert: రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం: డ్రోన్స్, లోలెవల్ ఫ్లయింగ్ వెహికల్స్ తో పంట నష్టం, ఇళ్లు, ఆస్తి నష్టంపై రియల్ టైమ్ ట్రాకింగ్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు ప్రారంభిస్తాం తీరం దాటాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే ఎర్రకాలువ సమస్య ఉందన్నారు. వెంటనే తగు చర్యలు చేపట్టాం. తుపాను తీరం దాటాక క్షేత్రస్థాయిలో గ్రామాలు, పంటపొలాలకు వెళ్లి సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించాం. ఇప్పుడు మా దృష్టి అంతా ప్రజలను చైతన్యవంతం చేసి, అప్రమత్తం చేయడమే. ప్రభుత్వం ఈ నెల 23 నుంచే అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రిగారు ఇప్పటికి 12సార్లు సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులంతా ఫీల్డ్ లోనే ఉన్నారన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: