Guntakal Railway : రైల్వే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు తమ విధి నిర్వహణలో భాగంగా బాధిత రైల్వే సిబ్బంది, కుటుంబాలను నిర్ణీత పని వేళలలో మాత్రమే సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ సిపిఓ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలలోని (Telugu states) కొన్ని రైల్వే డివిజన్లలో వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ల పనితీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పిసిపిఓఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రైల్వే ఉద్యోగి మృతి, నార్మల్ రిటైర్మెంట్, అధర్ ధాన్ నార్మల్ రిటైర్మెంట్, విఆర్ఎస్, మెడికల్ డీ-క్యాటగి రైజేషన్, మిస్సింగ్, రాజీనామా, కంవల్సరీ రిటైర్మెంట్ తదితర కారణాల వల్ల ఏర్పడిన సమస్యలను సదరు బీట్, సెక్షన్, యూనిట్ స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు బాధ్యతలతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కారుణ్య నియా మకాలు, సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ తదితర కేసులను నిర్ణీత కాలవ్యవధిలోగా నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో వివరాలు (Details) సేకరించే పనిలో భాగంగా సమయం, సందర్బం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు బాధిత కుటుంబాలను విసిగించరాదని, రైల్వే ఉద్యోగి మృతిచెందితే ఆఫీసులకు తిప్పుకోకుండా సదరు ప్రాంత వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ బాధ్యత తీసుకుని రైల్వే శాఖ మానవతా దృక్పథంతో చెల్లిస్తున్న రూ.25వేల ఫెనరల్ అడ్వాన్స్న బాధిత కుటుంబ సభ్యులకు అందజేయాల్సి ఉంటుంది. కొందరు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు ఫెనరల్ అడ్వాన్స్ మొత్తం ఇవ్వలేదు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :