हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Raghurama Raju: ఉండిలో రఘురామరాజు ప్రతీకార దినోత్సవం

Sharanya
Raghurama Raju: ఉండిలో రఘురామరాజు ప్రతీకార దినోత్సవం

ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. రేపు ఉండిలో ప్రతీకార దినోత్సవం అనే కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చిన తీరే దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. గతంలో తనపై జరిగిన అన్యాయానికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా తాను ఎదుర్కొన్న వేదనకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తలపెట్టారు.

2021లో జరిగిన ఘటన

రేపు తన ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహించాలని రఘురామ నిర్ణయించారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు పెట్టారని, తనపై కేసు పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రఘురామ తెలిపారు. అయితే ఆయా వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అని, రాజకీయపరమైన కక్షసాధింపు చర్య అని చాలా మంది అభిప్రాయపడారు.

ప్రతీకార దినోత్సవం వెనుక వ్యూహం

ఈ కార్యక్రమం కేవలం వ్యక్తిగతంగా ఆయనకు జరిగిన అన్యాయం గుర్తుగా కాదు వైసీపీ ప్రభుత్వంలో వీడియోలో మతాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారన్న కారణంతో రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. సీఐడీ కస్టడీలో రఘురామపై దాడి కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆ తర్వాత జైలు నుంచి రఘురామ విడుదలయ్యారు. అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ ఉండేవారు.

ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి

తద్వారా టీడీపీకి దగ్గరైన ఆయన గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. అయితే తనపై రాజద్రోహం కేసు పెట్టి హింసించినా ఆ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘురామరాజు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ కేసులో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచేందుకే ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో ఈ వ్యవహారంపై చర్చ జరిగేలా చేయాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా చర్చ

ఉండిలో ప్రతీకార దినోత్సవం ఏర్పాట్లపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నదే ప్రశ్న. ఈ కార్యక్రమం ద్వారా రఘురామరాజు తన బలాన్ని ప్రజల్లో ప్రదర్శించడమే కాకుండా, వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను మళ్లీ ప్రజల ముందు తీసుకురావాలన్న వ్యూహం కనిపిస్తోంది.

Read also: Vijayawada: కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా వాటిని తీసుకెళ్లడానికి పోటీ పడ్డ జనాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870