బాబా ధ్యానం చేసిన రాతిగుండుకు మందిరం నిర్మించి పూజలు
ఉరవకొండ : ప్రపంచ దేశాలకు ప్రేమ తత్వాలను చాటుతూ(Puttaparthi) అనేక సేవా కార్య క్రమాల ద్వారా దైవంగా కొలువబడిన భగవాన్ సత్య సాయిబాబాకు ఉరవ కొండతో విడదీయరాని బంధం ఉంది. తల్లి దండ్రులు పెట్టిన సత్యనారా యణరాజు పేరుతో పిలువ బడి తన 14వ యేట సత్య సాయిబాబాగా ప్రకటించుకుంది ఉరవకొండలోనే. బుక్కపట్నంలోని ఎలిమెంట్రీ పాఠశాలలో చదువుతున్న సత్యనారాయణ రాజు 1943-44 విద్యా సంవత్సరంలో 1–7– 1943లో పట్టణంలోని స్థానిక కరిబసవస్వామి బోర్డు ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో అడ్మిషన్ (సంఖ్య: 422) పొందారు. పాఠశాలలో పండితుడిగా పనిచేస్తు న్న సోదరుడు శేషమరాజు వద్ద ఉండి ఆయన విద్యా భ్యాసం కొనసాగించారు. ఆసమయంలోనే మౌనంగా ఉండటం, తనకు ఇష్టమైనప్పుడు పాఠశాలకు సమీపం లోని అబ్కారి ఇన్స్పెక్టర్ బంగళా ఆవరణంలోని పెద్ద రాతి గుండుపై కూర్చునేవారని చెబుతారు. 1940 అక్టోబర్ 20న పాఠశాలకు వెళ్లిన ఆయన తిరిగి వస్తూ ఇంటి వద్దకు రాగానే తన చేతిలోని పుస్తకాల సంచిని ఇంటిలోపలికి విసిరేసి “మాయ వీడినది, నేను సత్యనారాయణుడను కాను సత్యసాయి బాబాను నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాల్సి వుంది.. నన్ను నా భక్తులు పిలుస్తున్నారు.. నేను వెళ్తున్నానంటూ” వెళ్లి అబ్కారి ఇన్ స్పెక్టర్ బంగళా ఆవరణలోని రాతి గుండుపై కూర్చుండి పోయారు.
Read also: నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

ధ్యాన గుండుకు మందిరం నిర్మాణం – భజనలతో కొనసాగుతున్న ఆరాధన
14 సంవత్సరాల బాలుడు ఈవిధంగా మాట్లాడటం చూసి శేషమ రాజు భార్య ఆశ్చర్యంచెంది వారించేందుకు యత్నించారు. అయితే ఆయన ఎంతవారించినా వినకుండా వెళ్లి రాతి గుండుపై ధ్యానంలో మునిగిపోయారు. భవ బంధాలు వీడి తన భక్తుల(Puttaparthi) కోసం నిర్వహించాల్సిన కర్తవ్యం కోసం వెళ్తున్నా నని వెళ్లిన ఆయన విష యం ఉరవకొండ ప్రజల కు తెలిసి భక్తులు మెల్ల స్థానం వద్దకు చేరుకో సాగారు. మానవజాతిని అసత్యం వైపు నుండి సత్యంవైపుకు, చీకటి నుండి వెలుగువైపుకు నడిపించే గురుచరణములను పూజించి దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించడని ప్రభోదిస్తూ తొలిసారిగా ‘మానస భజరే గురు చరణం’ అన్న భజన గీతాన్ని భక్తులతో ఆలపింప చేశారని చెబుతారు. సత్యనారాయణరాజు ఇంటి నుండి వెళ్లిపోయి అవతార ప్రకటన చేసిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఉరవకొండకు చేరుకొని బాబాను ఒప్పించి పుట్టపర్తికు పిలుచుకెళ్లారు. నాటి నుండి సత్యసాయి మహానిర్యా ణం పొందే వరకు ఒక్కసారి కూడా ఉరవకొండకు రాకపోవడం విశేషం. బాబా నివశించిన ఇళ్లు పూర్తీగా శిధిలమైపోగా కొన్నేళ్ల క్రితం పునఃనిర్మించారు. బాబా ధ్యానం చేసిన గుండుకు మందిరం నిర్మించి బాల సాయిబాబా విగ్రహాన్ని కొలువుదీర్చి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భజన మందిరాన్ని ఏర్పాటుచేసి భజనలు కొనసాగిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: