గురువును దైవంగా భావించే సమాజం మనది. విద్యా ర్థులకు అక్షర భిక్షను పెట్టి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మలచే పవిత్రమైన ఉపాధ్యాయులంటే అందుకే అందరికీ ఎనలేని గౌరవం. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల కంటే 38శాతం ఎక్కువటీచర్లు ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకా రం రెండు తెలుగురాష్ట్రాలలో సుమారు 3లక్షలమంది పైగా ప్రైవేట్ టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 60 శాతంమంది కనీస ఉద్యోగ భద్రత, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలకు నోచుకోకుండా బతుకు బండిని నెట్టుకొస్తున్నారంటే నమ్మా ల్సిందే. టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకో లేదని, ఏపీ, తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వాలైనా తమ సమస్యల మీద దృష్టి పెట్టాలని వారంతా కోరుతున్నారు. వినటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ప్రైవేటు టీచర్ల (Private teachers)జీవితాలు ఈ రోజు వెట్టిచాకిరి బానిసలకంటే దౌర్భాగ్యంగా ఉన్నాయి. గత పదేళ్లలో ప్రైవేటు స్కూళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయింది. వీధికొక స్కూలు వస్తున్నా, వాటిలో అనుమతులున్నవెన్నో తెలియని పరిస్థితి. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే ఈ స్కూళ్లలో రోజంతా నిలబడి పనిచేసే గొంతుపోయేలా పాఠాలు చెప్పే టీచర్లలో సగం మందికి ఉపాధి హామీ కూలీకి దక్కే వేతనం దక్కటం లేదు. వీరిలో చాలామంది ఏళ్ల తరబడి టీచరు నోటిఫికే షన్లు లేక, వయసు దాటిపోయి, సమీపంలోని ప్రైవేటు స్కూల్స్ లో పని చేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకుంటున్న వారు కొందరైతే.. ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో రాజీపడుతూ బతికేవారు మరికొందరు.
Read Also : Railway: రైల్వేలో రాయితీల పునరుద్దరణ.. ఎవరికీ వర్తిస్తుంది అంటే

నరకం
ప్రైవేటు స్కూళ్లలో టీచర్లకు (Private teachers)మార్చి నెల వచ్చిందంటే నరకం గుర్తుకు వస్తుంది. స్కూలు సమయం తర్వాత వీరు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఒప్పించి, అడ్మిషన్లు చేయించాలి. మేనేజ్మెంట్ వారు చెప్పినన్ని అడ్మిషన్లు చేయని టీచర్లకు వచ్చే ఏడాది ఉద్యోగం లేనట్లే. ఎలా గూ ఏప్రిల్, మే వేతనాలు ఇవ్వరు గనుక.. మరో మార్గం లేక టీచర్లు ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. ఒంటిపూట బడులు రోజుల్లో ఎర్రటి ఎండల్లో వీరిని అడ్మిషన్ల కోసం పంపే మేనేజ్మెంట్లు వీరి వేతన పెంపుదగ్గరకు వచ్చేసరికి మీ తరగతిలో పిల్లలకు మంచి మార్కులు రాలేదు అంటూ గొణగటం మామూలే. మన సమాజంలో ఏ సంఘం లేకుం డా.. ఎవరికి వారే అన్నట్లు పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రైవేటు టీచర్లే. కాబట్టి తమ సమస్యలపై వీరు కలిసి కట్టుగా పోరాటం చేయలేకపోతున్నారు. ప్రయి వేటు టీచర్స్ ఎవరైనా సంఘం పెట్టినట్టు తెలిసినా, తమ పాఠశాలలో పని చేసే టీచర్లు అందులో చేరినా వారి ఉద్యో గాన్ని తొలగించటమే కాకుండా, వారికిమరే ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం రాకుండా యాజమాన్యాలు చేయటం ఇక్కడచాలా కామన్గా జరిగే వ్యవహారం. కనుక పోరుబాట పట్టి కుటుం బాన్ని పస్తులుంచలేక వీరంతా ఏసంఘంలోనూ చేరేందుకు ముందుకు రాలేని దుస్థితి నెలకొంది. ప్రైవేటు స్కూల్స్ లో నెలకు ఒక సెలవు కంటే ఎక్కువ పెడితే వేతనం కట్ చేయటం కామన్.
వేతనాలు తక్కువ
నెలలో వచ్చే 4 ఆది వారాలు పోనూ ఒక సెలవు మాత్రమే ఉండే ఈ స్కూళ్లలో అంతకంటే ఎక్కువ సెలవులు పెరిగితే శాలరీకోసిపారేస్తారు. చాలా స్కూళ్లలో ఆదివారానికి ముందు, తర్వాతి రోజు సెలవుపెడితే.. రెండు రోజుల జీతం కట్. అనారోగ్యం గానీ అత్యవసరంగా సెలవు కోరితే ఇచ్చే అవకాశం బహు తక్కువ. గ్రామం, మండలం స్థాయిలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో రోజుకు 9 గంటలపాటు పనిచేసే టీచర్లలో సగం మంది వేతనాలు రూ. 9 నుంచి 12 వేల మధ్యనే ఉన్నాయి. ఇక పదో తరగతి పిల్లలకు బోధించే టీచర్లు రాత్రి 8 గంటల వరకు బడిలో ఉండా ల్సిందే. దీనికి అదనంగా చెల్లించేది ఏమీ ఉండదు. స్కూలు యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర 12 నెలల ఫీజులు వసూలు చేస్తారు. కానీ టీచర్లకు మాత్రం పది నెలలకే జీతం అందుతుంది. ఏప్రిల్, మే నెలలకూ వేతనం ఇచ్చే స్కూళ్లుమొత్తం తెలంగాణలో కేవలం 5శాతం మాత్ర మేనంటే నమ్మాల్సిందే. తెలంగాణలోని వందలో 20 శాతం స్కూళ్లలో టీచర్లకి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కూడా లేవు. వీరికి నేరుగా వేతనాన్ని నగదు రూపంలో అందిస్తున్నారు. దీనివల్ల వీరికి ప్రభుత్వ పరంగా అందే వైద్యసదుపాయం, మెటర్నిటీ లీవ్ వంటివి ఏమీ అందవు. ఇక కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. గత పదేళ్లలో ప్రైవేటు స్కూళ్ల యాజమా న్యాలు మరింతగా ప్రైవేటు టీచర్ల కష్టాన్ని దోచుకుంటున్నా యి. కళ్లముందు ఇంత జరుగుతున్నా, విద్యాశాఖ అధికారు లు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్ప రాజకీయ పార్టీలు ప్రైవేటు టీచర్ల సమస్యల్ని ప్రస్తా వించకపోవటం దురదృష్టకరం. ఇకనైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు తగినచర్యలు తీసుకుని, ప్రైవేటు స్కూళ్ల యాజ మాన్యాలను కట్టడి చేయటంతోబాటు ఇక్కడ పనిచేసే టీచర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి.
-గోరంట్ల శివరామకృష్ణ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: