కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కి బర్త్ డే విషెస్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని ఒక పోస్ట్ చేశారు. “కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు (Rammohan Naidu) గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఒక యువ నాయకుడు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
Read Also: AP Tourism: పర్యాటకానికి కొత్త వెలుగులు: మంత్రి దుర్గేష్
ఎంపీగా ప్రాతినిధ్యం
1987లో జన్మించిన రామ్మోహన్ నాయుడు, 2024 నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16, 17, 18వ లోక్‌సభలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2025లో ఆయన సొంత జిల్లాకు చెందిన పొందూరు ఖాదీకి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ లభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: