మన దేశంలో సంవత్సరానికోసారి ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. సాగు రంగంలో సంక్షో భం, కుటుంబ కలహాలు, నిరుద్యోగం, ఉపాధి అవకాశాల లేమి వంటి కారణాలతో రైతులు, గృహిణులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు విద్యార్థుల వరకూ ఈ విషాద గాధ విస్తరించింది. 2019లో దేశ వ్యాప్తంగా 1,39,123 ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ సంఖ్య 1,71,418కి పెరిగింది. వీటిలో పెద్దవాటా రైతులకూ, విద్యార్థులకూ చెందింది. ముఖ్యంగా మార్కులు, ర్యాంకుల ఒత్తిడికి తాళలేక, పరీక్షల్లో వైఫల్యం భయంతో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు (Youth suicide)పాల్పడు తున్నారు. 2017లో దేశవ్యాప్తంగా 1.29 లక్షల మందితమ ప్రాణాలను తామే తీసుకుంటే, 2023లో ఈ సంఖ్య 1.71 లక్షలకు చేరింది. విద్యార్థుల ఆత్మహత్యలు (Youth suicide)2017లో 9,905 ఉండగా 2023లో 13,892కి పెరిగాయి. ఇవి పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా ఎన్సీఆర్బీ సేకరించిన గణాంకాలు మాత్రమే. వెలుగులోకి రాని సంఘటనలను పరిగణిస్తే ఈ సంఖ్య మరింతగా ఉందనే అంచనా నిపుణులు చెబుతున్నా రు. పిల్లల ఇష్టాలు, సామర్థ్యాలను పక్కన పెట్టి పెద్దలు బలవంతంగా కోర్సులు ఎంచి పెడుతున్నారు. ఆటవిడుపుకి అవకాశం లేకుండా బడి, కోచింగ్ సెంటర్ అనే బండ బాధ లతో పిల్లల బాల్యం మసకబారుతోంది. అందరి తెలివితేట లను ఒకే త్రాసుపల్లెలో కొలిచే అశాస్త్రీయ పరీక్షా విధానం యువత మనసును విసిగిస్తోంది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్ప డిన విద్యార్థులు 13,892 మంది. వీరిలో 7,300 మంది బాలురు, 6, 559 మంది బాలికలు, ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇది రైతు, రైతు కూలీల ఆత్మహత్యల కంటే 28.79 అధికం. ఈ మరణాల అధిక భాగం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. 2014తో పోలిస్తే 2023 నాటికి విద్యార్థుల ఆత్మహత్యలు 72 శాతం పెరిగాయి. తెలంగాణలో 4,732, ఆంధ్రప్రదేశ్లో 4,188 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది చదువుతారా, చస్తారా?” అనే భయభ్రాంత వాతావరణం సృష్టిస్తున్న మన విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం.
Read Also : Karnataka: బస్సు ప్రమాదంపై విచారణ జరపాలంటు డీకే శివకుమార్

న్యాగింగ్, కులవివక్ష, ఉపాధి లేమి, మత్తు పదార్థాల వినియోగం కూడా విద్యార్థులను మానసికంగా కుంగదీస్తున్నా యి. ఈ సమస్యలు ఎదుర్కోలేక చాలామంది యువత ఆత్మహత్యల దారిని ఎంచుకుంటున్నారు. విద్య అంటే కేవ లం పాఠాలు కాదు. స్వతంత్రంగా ఆలోచించే శక్తి, సరికొత్త మార్గాలు కనుగొనగల ధైర్యం, జీవిత ఆటుపోట్లను ఎదు ర్కొనే సహనం నేర్పే ప్రక్రియ అది. కానీ మన వ్యవస్థలో ఈ అంశాలన్నీ విస్మరించబడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, ప్రతి లక్ష జనాభాకు కనీసం ముగ్గురు సైక్రియాట్రిస్టులు అవసరం. కానీ మన దేశంలో కేవలం 0.75 మంది మాత్రమే ఉన్నారు. మానసిక వైద్యుల కొరత ను తగ్గించేందుకు వ్యవస్థాగత చర్యలు తీసుకోవడం అత్యవ సరం. ఇటీవల సుప్రీంకోర్టు విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్య సాయం, కౌన్సెలింగ్ వ్యవస్థ తప్పనిసరి చేయాలని సూచిం చింది. ఈ మార్గదర్శకాలు కఠినంగా అమలైతేనే విద్యార్థుల ప్రాణాలు కాపాడగలం. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లి దండ్రులు, సమాజం -అందరూ కలసి ఈ సమస్యను ఎదు ర్కొనాలి. మనకెందుకులే?” అనే నిర్లక్ష్యపు ధోరణి నుంచి బయటపడి మన సమాజం, మన బాధ్యత అనే చైతన్యం అవసరం. యువత మన దేశ భవిష్యత్తు. వారిని రక్షించ డం, ప్రోత్సహించడం మన సమిష్టి ధర్మం. మానసిక ప్రశాం తత కలిగిన మనిషి చీకట్లలో కూడా దారి కనుగొంటాడు. అలాంటి ధైర్యం, స్థిరత్వం కలిగిన తరం కోసం కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వాలు కలసి కృషి చేయాలి.
– మేకిరి దామోదర్
భారతదేశంలో యువత మరణాలకు ప్రధాన కారణం ఏమిటి?
భారతదేశంలో 15 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వారిలో యువత ఆత్మహత్య రేటు అత్యధికంగా ఉంది, ఇది యువత ఆత్మహత్యలో అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా ఉంది. భారతదేశంలో నమోదైన అన్ని ఆత్మహత్యలలో, 35% ఈ వయస్సు వారిలో సంభవిస్తున్నాయి.
యువతలో ఆత్మహత్య గణాంకాలు ఏమిటి?
12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారిలో తీవ్రమైన ఆత్మహత్య ఆలోచనల ప్రాబల్యం 2021లో దాదాపు 13% నుండి 2024లో 10%కి తగ్గిందని కొత్త నివేదిక చూపిస్తుంది. మరియు టీనేజర్లలో ఆత్మహత్యాయత్నాల ప్రాబల్యం కూడా స్వల్పంగా తగ్గింది – 3.6% నుండి 2.7%కి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :