రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల సంప్రదాయం ప్రకారం మొదట శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మహాద్వారం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్త పద్ధతిలో ఆతిథ్యం అందించారు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన అనంతరం, రాష్ట్రపతి గర్భగుడిలోకి ప్రవేశించి శ్రీవారి మూలవిరాట స్వరూపాన్ని దర్శించుకున్నారు.
Read Also: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

రంగనాయకుల మండపంలో వేదపండితులు
దర్శన సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆమెతో ఉన్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఛైర్మన్ మరియు ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, 2026 క్యాలెండర్, డైరీలు అందజేశారు.
గురువారం తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి, మొదట తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకున్న సందర్భంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు టీటీడీ అధికారులు ఆమెను ఆహ్వానించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: