మన దేశంలో సంప్రదాయంగా కుటుంబ సంబంధాలు, మానవ బంధాలు ఎంతో బలంగా ఉండేవి. చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకుని పరిష్కరించుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్లేశం – కోపం – ఆవేశం అనే త్రికోణంలో మనుషుల సహనశక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా యువత (Youth) లో సహనానికి బదులుగా వెంటనే స్పందించాలనే అలవాటు పెరుగుతోంది. ఫలితంగా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, అసహనాలు పుడుతున్నాయి.
అప్పటివరకు కుటుంబాల మధ్య పెద్ద విభేదాలు వస్తే కూడా పెద్దలు మధ్యవర్తిత్వం చేసి శాంతి పరుస్తుండేవారు. కానీ నేటి సమాజంలో చిన్న కారణాలకే పెద్ద పరిణామాలు కనబడుతున్నాయి. ఇటువంటి చిన్న అపార్థాలే (Small misunderstandings.) చాలా సార్లు ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తున్నాయి. దాంతో కుటుంబాల్లో ఉన్న ఆప్యాయత, నమ్మకం బలహీనపడుతోంది.తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లాలో షాకింగ్ సంఘటన
ప్రకాశం (Prakasham) జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామానికి చెందిన ఇళ్ల లక్ష్మీనారాయణ (25), అతడి భార్య స్థానికంగా కాపురం ఉంటున్నాడు. ఆదివారం లక్ష్మీ నారాయణ తన భార్యతో గొడవ పడ్డాడు. తనకు రోజూ భార్య పచ్చడి అన్నం పెడుతుందని దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆదివారం కావడంతో చికెన్ (Chicken) తినాలని ఉందని భార్యకు చెప్పినా ఆమె చికెన్ వండలేదు.
దీంతో భర్త లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురయ్యాడు. అంతే.. పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పి.చౌడయ్య మీడియాకు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: