हिन्दी | Epaper

Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Siva Prasad
Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Prakasam district murder: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో అత్యంత దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం, దోర్నాల గ్రామానికి చెందిన లాలు శ్రీను (38) అనే వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. శ్రీనుకు ఝాన్సితో 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి కుటుంబ జీవితం కొనసాగుతోంది. శ్రీను లారీ డ్రైవర్‌గా పని చేస్తూ, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టై ఒంగోలు జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు.

Read Also: ఆదిలాబాద్‌లో పాతిపెట్టిన మృతదేహం తల మాయం

వివాహేతర సంబంధమే కారణమా?

ఈ సమయంలో శ్రీను భార్య ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన శ్రీను ఈ విషయం తెలుసుకుని భార్యను, ఆమె సంబంధాన్ని ప్రశ్నిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఝాన్సీ, సూర్యనారాయణ కలిసి హత్యకు పథకం రచించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.

Prakasam district murder
Prakasam district murder: Wife murders husband with the help of her lover

పెద్దారవీడు మండలంలోని అంకాలమ్మ గుడి సమీపంలో శ్రీనును ఒంటరిగా పిలిపించి, ముందుగా అతని కళ్లలో కారం కొట్టి అంధుడిని చేశారు. అనంతరం కత్తితో పలు మార్లు పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో ఈ హత్య ఘటన మరోసారి స్పష్టంచేసిందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

📢 For Advertisement Booking: 98481 12870