నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50వేల మొక్కలు నాటడమే లక్ష్యం అని మంత్రి పొంగూరు నారాయణ(Ponguru Narayana) అన్నారు. గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యం(Green city initiative)లో 28 డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. 14వ డివిజన్ సాయిబాబా గుడి వద్ద ద్వారకామాయి నగర్ లో చెట్లు నాటే కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో 2000 మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
Read also: Drugs: సూత్రధారులే మూలం

ఒక్కొక్క వీధిలో ఒక్కొ రకం పూలు పూచే విధంగా చెట్లు నాటడం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్లో ఐదు మీటర్ల కి ఒక మొక్క నాటడం జరుగుతుందన్నారు. తాను పలుమార్లు చండీగర్ సిటీని విజిట్ చేయడం జరిగిందని అక్కడ పచ్చదనం బాగుంటుందన్నారు. ప్రతి ఐదు మీటర్ల కి ఒక చెట్టు ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పచ్చదనం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారన్నారు. నెల్లూరు లోని అన్ని మున్సిపాలిటీలలో మంచినీటి వసతి, పాఠశాలలు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రోడ్లు, డ్రైన్లు, హాస్టల్లో, మరియు కమ్యూనిటీ హాలులు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగరంలోని 13 రైన్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఎనిమిది డ్రైన్స్ మరమ్మతుల ప్రారంభించడం జరిగిందన్నారు.
త్వరలో మిగిలిన ఐదు ట్రైన్లు కూడా త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు. పచ్చదనం పెంపొందించే విషయమై గ్రీన్ కార్పొరేషన్ మరియు నగర్ పాలక సంస్థ సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. దీని కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 2017 లో వచ్చిన తుఫాన్ కారణంగా చాలావరకు నగరంలో మునిగిపోవడం జరిగిందని అటువంటి పరిస్థితి మరల పునరావృతం(Repetition) కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిధులు కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ విడతల వారీగా పూర్తి చేయడం జరుగుతుందని ప్రజలు కొంత సంయమనం పాటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి,గ్రామ వార్డు సచివాలయాల అధికారిని హిమబిందు,14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్,పసుపులేటి మల్లి, రామాంజనేయరెడ్డి , రమణ కుమార్,మీరాబాషా స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: