మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ కుటుంబ సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్పై నమోదైన కేసుకు స్పందిస్తూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. భూ వివాదం నేపథ్యంలో ప్రైవేట్ భూమిలోకి యంత్రాలతో ప్రవేశించి కూల్చివేతలు జరిపారన్న ఆరోపణలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి… చట్టం ముందు ఎవరైనా సమానమేనని, నేరం జరిగితే తన కుమారుడికైనా శిక్ష తప్పదని తెలిపారు.
Read also: Shamshabad: ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..

తమ కుటుంబ సభ్యులపై
పొంగులేటి మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యులపై కేసు నమోదైందని ప్రభుత్వంగా లేదా అధికారంగా ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. విచారణ పూర్తిగా స్వతంత్రంగా, నిర్బంధాల్లేకుండా సాగుతుందని చెప్పారు. ఆరోపణల్లో నిజం ఉంటే చట్టం ప్రకారం శిక్ష తప్పదని, ఒకవేళ ఆరోపణలు నిరాధారంగా తేలితే, అది ఆరోపణలు చేసినవారి బాధ్యతేనని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: