ఊదురుగొట్టం వాడు ఊదుతూ ఉంటే చల్లార్పు డు గొట్టం వాడు చల్లారుస్తున్నట్లు ఉందికాలు ష్య నివారణ విషయంలో పాలకులు, కొందరు పారిశ్రామికవేత్తలు వ్యవహరిస్తున్న తీరు. కాలకూట విషంగా మారుతున్న నీటి, వాయుకాలుష్య విషవాయు వుల నుంచి ప్రజలను కాపాడేందుకు పాలకులు చట్టా లపై చట్టాలు తెస్తున్నా, ఎందరిపైనో చర్యలు తీసుకుంటు న్నా కాలుష్య (pollution)కాటుకు బలయ్యేవారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఇంకా జాప్యం చేస్తే కాలుష్యకాటుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అమా యకులు బలికాక తప్పదని పర్యావరణవేత్త శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జీవించే హక్కు కల్పించాల్సిందిగా కోరుతూ ఎందరో ఈ కాలుష్య (pollution)కాసారంలో చిక్కుకున్న అభాగ్యుల వేదన అరణ్యరోదనగా మిగిలిపోతున్నది. కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. అనేక చట్టాలు తెచ్చారు. చర్యలు తీసుకుంటున్నారు. అయినా అవేమీ కాలుష్యం నుండి ప్రజలను కాపాడలేకపోతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో కాలుష్యం అంతకంతకు పెరిగి ఇప్పుడు నగరాల పరిసర ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం సగం నగరాల్లోనే నివసి స్తున్నది. మరో మూడు దశాబ్దాల నాటికి నగర జనాభా అదనంగా మూడువందల కోట్లకుపైగా పెరుగుతుందని అధికారుల అంచనా. భూభాగంపై నగరాల వైశాల్యం రెండు మూడు శాతానికి మించకపోయినా కాలుష్యం మాత్రం అది ప్రపంచ జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా స్థూల దేశీయోత్పత్తిలో అరవైశాతం కేవలం ఆరువందల పట్టణాల్లో కేంద్రీకృతమై ఉందంటే నగరాల ప్రాధాన్యత ఎంతగా ఉందో వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభం, గ్రామీణ ప్రాంతాన్ని అత లాకుతలం చేయడంతో నగరాలకు వలసలు పెరిగిపోతున్నాయి. అందుకే గ్రామీణ జనాభా తగ్గుతుండగా, పట్ట ణాల్లో జనాభా యేడాది యేడాదికి పెరిగిపోతున్నది. మరీ ముఖ్యంగా భారతదేశంలో అయితే పట్టణీకరణ అందుకో లేనంతగా విస్తరిస్తున్నది. 2001లో పట్టణ ప్రాంతాల్లో జనాభా ఇరవై ఎనిమిదిన్నర కోట్లు ఉండగా ఇప్పుడు అది దాదాపు యాభై కోట్లకు చేరుకున్నదని చెప్తున్నారు. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా కనీస వసతులు కల్పిం చడంలో పాలకులు విఫలమవుతున్నారనే చెప్పొచ్చు. 2005లో ప్రారంభించిన జవహర్లాల్నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జెఎన్ఎన్ఎయుఆర్ఎమ్) కింద పట్టణ ప్రాంతాలకు మరికొన్ని సౌకర్యాలు కల్పించి మె రుగైన జీవనం కల్పించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న అవసరాలు, జనాభాను అవి అందుకోలేకపోతున్నాయి. భారత్లో ఆరు మెట్రోనగరాల్లో ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విస్తరణ అంశాల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా చేప ట్టడం వల్ల తీవ్రమైన ప్రభావం చూపుతున్నదనే విషయం వెలుగు చూసింది. ముఖ్యంగా నగరాల్లో వాయుకాలుష్యం వల్ల పౌరుల ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందని హెచ్చ రించింది. చెన్నై, కోల్కతా, ముంబాయిలతోపాటు హైద రాబాద్లో కూడా వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. పారి శ్రామిక కాలుష్యంతో బెంగళూరు నగరం అతలాకుతలం అవుతుంది. ఇక వాహనాలు, నీటి కాలుష్యంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సర్వేలు వెలువడుతున్నాయి. నిర్మాణరంగం వల్ల పీల్చే గాలిలో అధికశాతం దుమ్ముధూళి చేరుతుండడం ప్రజారోగ్యం రానురాను ప్రశ్నార్థకంగా మారుతుంది. నగర శివారుల్లోని పరిశ్రమల నుండిగాలిలో వదులుతున్న కాలు ష్యాలకు అడ్డూఅదుపు లేకుండాపోతున్నది. మరొకపక్క విషపూరితమైన రసాయనిక కలుషిత జలాలను శుద్ధి చేయకుండా మూసీలో కలుపుతున్న పరిశ్రమలపై చర్యలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆ నది పరివాహక ప్రాంతమంతా కాలుష్య కాసారంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వ విధానాలు, కొందరు అధికారులు అవినీతి, అస మర్థత, అంతులేని నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య రోజు కు ఇంత పెరిగిపోతున్నది. మూసీతోపాటు ఎన్నో చెరువులు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. ఈ చెరువుల్లో చేపలు జీవించలేని పరిస్థితి ఏర్పడింది. కాలుష్యం విస్త రించే కొద్దీ ముందు జలచరాలు, ఆ తర్వాత పశుపక్ష్యా దులతోపాటు మానవ జీవనం కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర నగరాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగాలేదు. వాతావరణం లో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదు రెట్లు అధికంగా ఉండడంతో శ్వాససమస్యల నుంచి కేన్సర్గాకా అనేక రోగాల భారిన పడుతున్నారని డాక్టర్లే చెబుతున్నారు. ముఖ్యంగా భావితరానికి ప్రతినిధులైన బాలల బతుకులు ఈ వాయు, నీటి కాలుష్యం చిదిమేస్తుండడం ఆందో ళన కలిగించే అంశం. వాయుకాలుష్యం మనిషికే కాదు దేశ సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతులకు ప్రతీకలుగా భాసిల్లుతున్నా వారసత్వ కట్టడాలకు ముప్పు ముంచుకొ స్తున్నదని పర్యావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ప్రభు త్వం నిర్వహించిన పరిశీలనలో ముప్పై తొమ్మిది నగరాల్లో 138 వారసత్వ కట్టడాల పరిస్థితి వాయుకాలుష్యం వల్ల ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడయింది. మొత్తం మీద కాలుష్యనివారణకు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. త్రికరణశుద్ధిగా అమలుకు కృషి చేయాలి. ఈ యుద్ధంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: