విజయవాడ Politics : జగన్ మోదీకి దత్తపుత్రుడని అందుకే సీబీఐ (CBI) ఆయన విషయంలో మెతక వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. మోదీ చేతిలో సీబీఐ కీలు బొమ్మ అని.. జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపైసంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు. వై నాట్? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని.. ఇంత వరకు న్యాయం జరుగలేదన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. జగన్ కోసం అవినాష్ రెడ్డిని కూడా కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నిజంగా సీబీఐ అనుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేదన్నారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. న్యాయం ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారామె.

బిజెపి, మిత్రపక్షాలపై తీవ్ర విమర్శలు – మైనార్టీల హక్కులపై ఆందోళన
సీబీఐ విచారణ సరిగా లేదంటూ సునీత చేసిన ఆరోపణల్లో నిజముందన్నారు. మైనార్టీల హక్కుల పట్ల కేంద్రంలోని బిజెపి (BJP) ప్రభుత్వానికి విలువ లేదన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య చిచ్చుపెట్టడమే బిజెపి సిద్ధాంతమన్నారు. ఆ చిచ్చులో చలి కాచుకొంటుందన్నారు. సిఎఎ, వక్స్ బిల్లు సవరణ, ఆర్టికల్ 370, అయోధ్య రామమందిరం వంటి వివాదాలతో ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారన్నారు. రాష్ట్రంలో టిపిడి, వైసిపి, జనసేన మూడు బిజెపి పార్టీలేనన్నారు. టిడిపి, జనసేన బహిరంగ పొత్తులో ఉంటే, వైసిపి అధినేత జగన్ది అక్రమ పొత్తుగా పేర్కొన్నారు. సెక్యులర్ పార్టీల ముసుగులో మైనార్టీలను టిడిపి, వైసిపిలు మోసం చేస్తున్నాయని తెలిపారు. మైనార్టీల ప్రయోజనాలు దెబ్బతినే అన్ని బిల్లులకు ఈ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూమైనార్టీ ద్రోహులేనన్నారు. 45, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పారన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :