విజయవాడ : కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఈ రోజు ఉదయం టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీ యాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారి విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయ నేతగా చాలా బాధేస్తున్నదని మంత్రి చెప్పారు. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన తనకు మూడు దశాబ్దాల అనుభవం ఉందని గుర్తుచేస్తూ.. నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీ యాలను చాలా దగ్గరి నుంచి చూస్తున్నానని తెలిపారు. అయితే, వైసీపీ నేతలు వ్యవహార తీరును తాను ఏనాడూ చూడలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శించినా కూడా ఎక్కడా ఎవరూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. నేతలను కించపరిచేలా మాట్లాడటం, అప్రజాస్వామికంగా మాట్లాడటం ఎక్కడ కూడా తాను చూడలేదన్నారు. అధికార పక్షాన్ని కించప రచడం కోసం అరాచక శక్తులని ప్రోత్సహించడం ఎప్పుడూ చూడలేదన్నారు. హుందాగా ప్రజాస్వా మ్యబద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారని చెప్పారు. ఈరోజు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరు చూస్తుంటే చాలా బాధేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గెలుపు ఓటములు సర్వసాధారణం కానీ గెలిచినా ఓడినా నైతిక రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతీ రాజకీయ నేతపై ఉందన్నారు. బహుశా వైనాట్ 175 నుంచి 11 స్థానాలకు పడిపోవడం మూలంగా జగన్ (JAGAN) ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోందని మంత్రి తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :