జగ్గయ్యపేట : రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ కూటమి సర్కార్ (Double engine government) కేంద్రంలోని అడుగులకు మడుగులొత్తుతూ ప్రజావ్యతిరేక పరిపాలన చేస్తున్నారని భారతీయ కమ్యూనిస్టు పార్టీ (CPI) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం జరిగిన జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మహిళలతో ఎర్రజెండాలు చేతపట్టి పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షత వహించారు. సభలో జాతీయ నాయకులు అక్కినేని వనజ, మాజీ ఎమ్మెల్సీ జెన్ని విల్సన్, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి పరుచూరి రాజేంద్ర, స్థానిక నేతలు అంభోజి శివాజీ, జూనెబోయిన శ్రీనివాసరావు, పోతుపాక వెంకటేశ్వర్లు, నీలకంఠ శివప్రసాద్, మెటికల శ్రీనివాసులు, మాశెట్టి రమేష్ బాబు, భోగ్యం నాగులు, మహ్మద్ అసదుల్లా, కరీం సిపిఐ కార్మిక సంఘాల నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేని పార్టీ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు.
కేంద్రం ప్రజల నడ్డివిరిచి అంబాని, ఆదానిలకు సంపదను దోచి పెడుతుందన్నారు. చిల్లర వర్తక వ్యాపారాలు, చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని నిందించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అదే బాటలో నడుతుందని ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట ప్రాంతాన్ని పారిశ్రామిక క్యారిడార్గా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. కొందరు మాత్రం ఆదానీ కారిడార్ బాగుంటుందని ప్రకటిస్తే అభిప్రాయపడుతున్నారంటూ విమర్శించారు.
VISIT TO : Hindi.vaartha.com
READ ALSO :