వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) జూలై 31న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మందికే అనుమతి ఇవ్వగా, జగన్ పరామర్శించనున్న జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ వద్ద మూడుగురికే ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.
రోడ్ షోలపై నిషేధం
జగన్ పర్యటన (Tour) సందర్భంగా రోడ్ షోలు, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించేందుకు పూర్తిగా నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ వేదికలుగా మారకుండా పర్యటనను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
శాంతి భద్రతలకు పోలీసుల సిద్ధత
జగన్ పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయగా, డ్రోన్ ద్వారా పర్యటన ప్రాంతాలను నిగిలించే ఏర్పాట్లు చేశారు. ప్రజలు సహకరించాలని, భద్రతా చర్యలపై ఎలాంటి అనుమానాలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also : Gautam Gambhir : ఓవల్ మైదానం క్యూరేటర్ కు గంభీర్ సీరియస్ వార్నింగ్!