కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో అదృశ్యమైన నలుగురు బాలికలను పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. గుంటూరు సమీపంలో బాలికల ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని గన్నవరం స్టేషన్‌కు తీసుకురానున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నలుగురు విద్యార్థినులు ఇంటర్ చదువుతున్నారు. తెల్లవారుజామున ఇంటి నుంచి వీరు పరారయ్యారు.
విద్యార్థినుల అదృశ్యం – తల్లిదండ్రుల ఆందోళన
రెండు రోజుల క్రితం కళాశాలకు వెళ్లకుండా నగరంలోని ఓ షాపింగ్ మాల్‌కు నలుగురు విద్యార్థినులు వెళ్లారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు వారిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నలుగురు బాలికలు ఇంటి నుంచి పరారైనట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే బాలికల ఆచూకీ కనుగొన్నారు.