Polavaram: బనకచర్ల డిపిఆర్ టెండర్లను అడ్డుకోండి గోదావరి, కృష్ణా పరీవాహక రాష్ట్రాలతో సమావేశం జరపండి కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ. హైదరాబాద్ : పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం కోసం రూ.920లక్షలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు సిడబ్ల్యుసి అనుమతి ఇవ్వడంతో ఈ నెల 6న ఏపీ టెండర్ నోటీసు ఇచ్చిందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎగువన ఉన్న రాష్ట్రం నీటిహక్కులకు భంగం కలుగుతోందిన ఆవేద వ్యక్తంచేశారు.
Jubilee Hills by-election: ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన చర్యలు!

Polavaram
తెలంగాణ (Telangana) ప్రయోజనాలకు నష్టం కలిగించే, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు. Polavaram ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అధారిటీ, గోదావరి, కృష్ణానదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం బనకచర్ల విషయంలో ఎపి ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరారు. టెండర్, భూసేకరణ విషయంలో ముందుకు పోనివ్వద్దని కేంద్ర మంత్రిత్వశాఖను విజుప్తి చేశారు. 200టిఎంసి నీటిని గోదావరి బేసిన్ నుంచి పెన్నాబేసిన్క తరలించడానికి ముందు గోదావరి, కృష్ణాభాగస్వామ్య రాష్ట్రా లతో సమావేశం కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ముందుకు వెళ్లకుండా నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్ర పునర్వి భజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. దాన్ని ఉల్లంఘించి పోలవరం బనకచర్ల లింక్ను నిర్మిస్తూ డిజైన్లు మార్చుతున్నారు. పర్యావరణ అనుమ తులను, సీడబ్ల్యూసీలోని టిఎసినిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, జిఆర్ఎంబి,సిడబ్ల్యుసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను తిరస్కరించాయి. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టవద్దని, సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 75 శాతం సక్సెస్ రేట్ ఉండాలంటూ 2010లో ప్లానింగ్ కమిషన్ సూచించింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా ఈ లింక్ నిర్మాణంలో భూ సర్వే అవార్డుకు అడుగులు వేస్తోంది అని తెలంగాణ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ఏ కేంద్రశాఖకు లేఖ రాసింది?
కేంద్ర జలశక్తి శాఖకు.
పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి తెలంగాణ ఆందోళన ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపీఆర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం, నీటిహక్కుల ఉల్లంఘన.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: