విజయనగరం(Vijayanagaram) జిల్లా గాజులరేగలో జరిగిన అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పును ఇచ్చింది. తన స్వంత మనవరాలిపై లైంగిక దాడి(POCSO) చేసిన బొండపల్లి సత్యారావు (59) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ₹5,000 జరిమానా, బాధిత చిన్నారి పునరావాసం కోసం ₹5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘోర ఘటన ఆగస్టు 18, 2025న బయటపడింది. ఇంట్లో పెద్దలు లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని సత్యారావు బాలికపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
Read Also: HYD Crime: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు – వేగంగా దర్యాప్తు
కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బాలిక తల్లి ఘటనను గుర్తించి బాలికను ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆమె మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జి. శిరీష పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆర్. గోవిందరావు పర్యవేక్షణలో దర్యాప్తు పూర్తిచేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
బలమైన వాదనలతో శిక్ష ఖరారు
కోర్టు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(POCSO) ఖజానా రావు దృఢమైన ఆధారాలు, వాదనలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది. ఈ తీర్పు బాలలపై నేరాలకు రాష్ట్రవ్యాప్తంగా కఠిన హెచ్చరికగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మరింత కఠిన చర్యలు, అలాగే చిన్నారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: