PM SHRI scheme: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త ఏడాది సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కనీస వసతులు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించడంతో పాటు, జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రకటించారు.
Read Also: Indian Railways: వందే భారత్ స్లీపర్ సేవలకు గ్రీన్ సిగ్నల్

ఈ విషయాన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రధాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM Schools for Rising India) పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఏపీలో 935 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 935 ప్రభుత్వ పాఠశాలలను కేంద్రం ఎంపిక చేసింది. ఆయా స్కూళ్లలో భవనాలు, మౌలిక వసతులు, డిజిటల్ సౌకర్యాలు, ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.
పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పందిస్తూ, ఏపీలో ఎంపికైన 935 పాఠశాలల్లో నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: