ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ ఇవ్వలేదంటూ రిజిస్ట్రీపై అభ్యంతరం వ్యక్తమైంది. అయితే హైకోర్టు (High Court) తక్షణమే స్పందించి రిజిస్ట్రీని నెంబర్ కేటాయించాలంటూ ఆదేశించింది.పీఎస్ఆర్ ఇప్పటికే ట్రైల్ కోర్టులో మధ్యంతర బెయిల్ పొందారని గుర్తు చేస్తూ, గడువు ముగియకముందే హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది.
ఆరోగ్య సమస్యలతో అత్యవసర పిటిషన్
ఆంజనేయులకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని న్యాయవాది తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా పిటిషన్ దాఖలైంది అన్నారు. మధ్యంతర బెయిల్ ఈ నెల 27తో ముగుస్తుందని తెలిపారు.
మధుసూదన్‌పై పోలీసులు నివేదిక సమర్పించాలని ఆదేశం
ఇదే సమయంలో మధుసూదన్‌పై నమోదైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైకోర్టు పోలీసులకు సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ మరింత వేగంగా జరిగే అవకాశముంది.పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించడంతో తదుపరి విచారణకు మార్గం సుగమమైంది. కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Read Also : Harish Rao : రేవంత్‌రెడ్డికి నీటి పై బాధ్యతలేదు : హరీష్‌రావు ఫైర్