డిసెంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల(Pensions) పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ (వితంతువులు) కేటగిరీకి చెందిన 8,190 కొత్త లబ్ధిదారులకు మొదటిసారిగా రూ.4,000 చొప్పున పింఛన్లు అందజేశారు. అర్హులైన మిగతా పింఛన్ గ్రహీతలందరికీ కూడా ఈ నెల పింఛన్లను ప్రభుత్వం జమ చేసింది.
Read Also: Chandrababu Naidu: సిఎం చంద్రబాబుపై కేసు క్లోజ్..

ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“దేశంలో సామాజిక భద్రతా పింఛన్లకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్” అని పేర్కొన్నారు.గత 18 నెలల్లో పింఛన్ల పంపిణీ కోసం రూ.50 వేల కోట్లకు పైగా, ఇక అయిదేళ్లలో మాత్రం రూ.1.65 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందన
ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రకటనలో ముఖ్యాంశాలు:
- ఉన్న పింఛన్లలో ఎటువంటి కోతలు పెట్టలేదు
- తప్పుడు ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపడం బాధ్యతారాహితం
- ఈ నెలే 63,25,999 మంది లబ్ధిదారులకు రూ.2,739 కోట్లు పింఛన్ల రూపంలో చెల్లించారు
- రెండు నెలలుగా పింఛన్ తీసుకోని 1,39,677 మందికి రూ.114 కోట్లు,
మూడు నెలలుగా తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది - ఏడాదికి రూ.33,000 కోట్లకు పైగా కేవలం పింఛన్లకే ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టంగా పేర్కొంది:
“ఇంత పెద్ద స్థాయిలో పింఛన్లు(Pensions) అందజేస్తున్న సమయంలో తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే. దయచేసి అసత్యప్రచారం నిలిపేయాలి.”
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: