हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pensions : అనంతపురం జిల్లాలో 9601 పిహెచ్ పింఛన్లు తొలగింపు

Shravan
Pensions : అనంతపురం జిల్లాలో 9601 పిహెచ్ పింఛన్లు తొలగింపు

Pensions : బోగస్ ఫించన్లు ఏరివేతకు ప్రభుత్వం చర్యలు (Government actions) చేపట్టింది. అందులో భాగంగా 40 శాతం కంటే వికలాంగ శాతం తక్కువుగా ఉండటంతో వికలాంగులకు సంబంధించి జిల్లాలో 9601 ఫించన్లు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఫించన్ దారులకు నోటీసులు జారీ చేసింది. అందులో అర్హులుంటే ఆయా మండల ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు అప్పీలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనంతపురం జిల్లాలో వివిధ క్యాటగిరిలకుసంబంధించి 2,83,219 ఫించన్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ రూ.125.960 కోట్లు ఫించన్లు రూపంలో పంపిణీ చేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా ఫించన్లు మంజూరు చేశారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఫించన్లు ఏరివేతకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదట విడతలో వికలాంగుల ఫించన్ల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. 40 శాతం వికలాంగ శాతం తక్కువుగా ఉన్న 9601 ఫించన్లు జిల్లాలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి వారందరికి ఈనెల 14న నోటీసులు జారీ చేసింది. అందులో హెల్త్ ఫించన్స్ 326, డిజెబుల్ ఫించన్స్ 9275 మొత్తం 9601 ఫించన్లు బోగస్ ఉన్నాయి.

Pensions

వికలాంగుల ఫించన్లు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది

వికలాంగుల ఫించన్లు (Disability pensions) తొలగిస్తున్నట్లు ప్రభుత్వం నుండి నోటీసులు అందుకున్న ఫించన్దారులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. పాత సందరం సర్టిఫికెట్ జిరాక్ , ఆధార్ కార్డు జిరాక్స్, పెన్షన్ కోల్పోయిన నోటీస్, బియ్యం కార్డు జిరాక్స్ సహా అప్పీలు దరఖాస్తులను ఆయా మండల ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలి. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఫలాన రోజు ఫలాన ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకోవాలని మరలా ఫించన్ దారులకు నోటీసులు అందజేస్తారు. ఆ నోటీసు ప్రకారంగా డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత ఫించన్క అర్హత ఉందని గుర్తించి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ను ఎంపీడీవో, కమిషన్లకు అందజేస్తే ఫించన్ ను పునరుద్ధరణ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ విధంగా తొలగించిన వికలాంగుల ఫించన్లలో ఎంత మంది అర్హత సాధిస్తారో అన్నది వేచి చూడాల్సిందే. అనంతపురం జిల్లాలో వికలాంగులకు సంబంధించి 9601 ఫించన్లు తొలగిస్తూ రెండు రోజులు క్రితం నోటీసులు ఇవ్వడం జరిగింది. అలా నోటీసులు అందుకున్న ఫించన్దారులు సంబంధిత పత్రాలతో ఆయా మండల ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు అప్పీలు చేసుకోనే అవకాశం వుంది. అలా అప్పీలు చేసుకున్న వారికి ఒక నోటీసు ఇచ్చి ఆసుపత్రిలో డాక్టర్తో చెకప్ చేయిస్తాం.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/law-anita-to-take-action-against-those-spreading-false/andhra-pradesh/533197/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870