हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Peaceful families: ప్రశాంత కుటుంబాలే విశ్వశాంతికి పునాదులు!

Sudha
Peaceful families: ప్రశాంత కుటుంబాలే విశ్వశాంతికి పునాదులు!

డిజిటల్ యుగంలో భూమి ఓ కుగ్రామం అయింది. దేశ సరిహద్దులు రేఖలుగానే మిగిలిపోయాయి. దేశ యువత ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నారు. వసుదైక కుటుంబ భావనలు వ్యాప్తి చెందుతున్నాయి. భాష, యాస, కుల, మత, వర్ణ, వర్గ, జాతి లాంటి విభేదాలు మరిచి, అంతర్జాల వలయంతో అనుసంధానించ బడుతూ ప్రపంచమే ఒక కుటుంబం వలే పరిణామం చెందుతున్నది. కుల మతాంతర వివాహాల తో పాటు విదేశీ జంటల వివాహాలు పెరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఐక్యత చాటుతున్నారు. విశ్వశాంతి వృక్షాల నీడన మానవాళి ప్రశాంత జీవనాలు (Peaceful families) గడుపుతున్నారు. కుటుంబాలు పలు రకాలుగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం, ప్యాట్రిలోకల్ కుటుంబం (భార్య భర్త కుటుంబానికి చేరడం), మ్యాట్రిలోకల్ కుటుంబం (భర్తభార్య కుటుంబానికి చేరడం), ఎక్స్ టెండెడ్ కుటుంబం(పలు తరాల వ్యక్తులు ఉన్న కుటుంబం), బైలోకల్ కుటుంబం (దంపతులు ఇద్దరు ఇరువురి కుటుంబాల్లో జీవించడం), నియోలోకల్ కుటుంబం (డిజిటల్ యుగపు దంపతులు స్వంత కుటుంబం) అనబడే వివిధ రకాల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ విలువలుపలుచబడితే సమగ్రాభివృద్ధి కుంటుబడుతుంది. విశ్వంలో శాంతి కొలువు తీరాలంటే కుటుంబంలో ప్రశాంతత (Peaceful families) నెలకొనాలి. నేటి డిజిటల్ యుగం లో కుటుంబ విలువలు తరుగుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీలు పుట్టుకొస్తున్నాయి. అమ్మనాన్నల వెతలు పెరు గుతూ, అనాథాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. తోబుట్టువుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఆస్తి పంపకాలు రక్తసిక్తం అవుతున్నాయి. ఈ విషయాలను గుర్తించినఐరాస 1994 ఏడాదిని అంతర్జాత కుటుంబాల సంవత్సరంగా ప్రకటించింది. దీనితోపాటు 1997లో ఐరాస తీసుకున్న నిర్ణయం ప్రకారం జనవరి 01 రోజును శాంతి కోసం ఒక రోజు (ఏ డే ఆఫ్ పీస్)” అనే నినాదం తీసుకోవాలని సూ చించింది. యుద్ధాలు, మానవ ప్రేరేపిత సంక్షోభాలు/ విప త్తులు లేని ప్రపంచ నిర్మాణం కావాలని ఐరాస పేర్కొంటున్నది.

Read Also: TTD: గత దశాబ్దంలో ఎన్నడూ లేని లడ్డూ విక్రయాలు


Peaceful families

Peaceful families

2001 నుంచి ప్రతి ఏటా 01 జనవరి రోజును ప్రపంచ కుటుంబ దినం లేదా గ్లోబల్ ఫామిలీ డేగా పాటిం చాలని ఐరాస సూచించడం జరిగింది. ప్రపంచ కుటుంబ దినం 2025 వేదికగా కుటుంబాలు, పౌర సమాజం, శాంతి అంశాల మధ్య సంబంధాలను వివరించడంతో పాటు ప్రత్యే కంగా కుటుంబాల (పాధాన్యాన్ని వివరించడంతో పాటు ప్రపంచ శాంతి విలువను ప్రచారం చేయడం జరుగుతుంది. భవిష్యత్తు తరాల్లో విశ్వ కుటుంబ భావనలు మొలకెత్తే విధంగా 01 జనవరి రోజున ప్రపంచ కుటుంబ దినం వేదికగా సెమినార్లు, వెబినార్లు, కార్యశాలలు, శాంతి స్థాపన చర్చలు, విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగాలి. ప్రపంచ కుటుంబ దినం 2026 ఇతివృత్తంగా ‘ఐక్య కుటుంబాలతో సుస్థిర భవిష్యత్తు వైపు’ అనబడే అంశాన్ని తీసుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్గత సంక్షోభాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అమానవీయ పోకడలను గుర్తించి అంతర్జాల వేదికగా శాంతియుత వాతావరణాన్ని కల్పించటా నికి అవసరమైన చర్యలను నేటి యువత, శాంతి స్థాపన సంస్థలు, పౌర సమాజం సూచించడం జరగాలి. మూడవ ప్రపంచ యుద్ధ ఆలోచనలను మట్టుపెట్టడం, మానవాళి ఐక్యతతో శాంతియుత సహజీవనం గడపడం అత్యవసర మని నమ్మాలి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని వెచ్చిస్తూ, శాంతియుత కుటుంబాలకు సంబంధించిన సిని మాలను వీక్షించడం, శాంతి స్థాపనకు కృషి చేయడం, కుటుంబాలు తమ లక్ష్యాలను నిర్ణయించుకోవడం లాంటి అంశాలను విస్తృతంగా వివరించాలి. కుటుంబం మన ఆస్తి పాస్తుల కన్న మిన్న అంటూ నినదించాలి. కుటుంబంతో సమయం గడపని వారు నిజమైన మానవులే కాదు అని ప్రచారం చేద్దాం. కుటుంబానికి విలువను ఇచ్చే సమాజం వసుదైక కుటుంబ భావనలకు కట్టుబడిఉంటుంది. ప్రపంచ మానవులందరూ ఒకే కుటుంబ సభ్యులు అని నమ్మాలి. శాంతి, ఐక్యతే మానవాళి నిత్యమంత్రం కావాలి.
-బి. మధుపాళి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870