విజయవాడ : ‘రాయలసీమ రైతులకు(Payyavula Keshav) మరింత ఆదాయం పెరగాలంటే ఉద్యాన పంటల సాగును మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉద్యాన పంటలు ప్రభుత్వ ఆదాయానికి కీలక వనరులేనని చెప్పారు. .ఉద్యాన పంటల సమాచారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల మీడియాతో మాట్లాడుతే తెలిపారు. కోనసీమలో వరి సాగు చేసే రైతుల కన్నా రాయలసీమలో(Rayalaseema) ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఆదాయం ఎక్కువ వస్తోంది. రెండు ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసి రూ. కోట్లలో ఆదాయం పొందిన వారూ ఉన్నారు. రూ. లక్షల్లో ఆదాయం పొందిన రైతులూ ఉన్నారు. ఆర్గానిక్ పంటలతో రాబడి ఎంతో బాగుంది.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అనుకుని రాయలసీమ ఉంది. ఇది ఎంతో అనుకూలాంశం ఉద్యాన పంటల ఉత్పత్తులను ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేయవచ్చు.
Read also: ఫైనల్‌లో ఆస్ట్రేలియాపైనే ఆడాలి

ఉద్యాన పంటల ఎగుమతి, ప్రభుత్వ ఆదాయం పెంచే అవకాశాలు
కొన్ని ఉద్యాన పంటలకు (Payyavula Keshav) విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. ఆ పంటల సాగు చేపట్టడం వల్ల విదేశాలకు ఎగుమతి చేస్తే మంచి ఫలితాలు వస్తాయిఇప్పటికే సీమలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సాగునీటిని అందిస్తున్నాం. ఆ నీటిని సద్వినియోగం చేసుకొని పంటలే కాదు పండ్ల తోటల పెంపకం చేపట్టాలి. అధికారులు సైతం ఈ విషయంలో అక్కడి రైతులకు అవగాహన కల్పించాలి సీమలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవసరమైన అనిన వనరులూ ఉన్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రమలు, కంపెనీలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయిస్తోంది. దీనికి తోడు పండ్ల ఎగుమతుల ద్వారా చర్కని ఆదాయం పొందొచ్చు’ అని. సోమవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ఇతర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాయలసీమ అభివృధ్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు..
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :