విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతులు—మన్నం కృష్ణమూర్తి సహా నలుగురు—దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. భూసమీకరణ పథకం (Land Pooling Scheme) కింద ప్రభుత్వానికి తమ భూములను అప్పగించినా… ఇప్పటివరకు వాగ్దానం చేసిన కౌలు అందలేదని పిటిషనర్లు వాదించారు.
Read Also: Rain Alert: ఏపీలో వర్షాల హెచ్చరిక

వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది
భూసమీకరణ పథకం కింద గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది హైకోర్టు (AP High Court). భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక, వాటిని వాడుకున్నా, వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది.
ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏను ఆదేశించిన న్యాయస్థానం, విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయంలో భూములు ఇచ్చిన ఇతర రైతులకు కూడా కౌలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు గుర్తుచేశారు. పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: