వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) జన్మదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జగన్ (YS Jagan) కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు జగన్ జన్మదినం సెలబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: AP: మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు
పవన్, YS షర్మిల స్పెషల్ విషెస్
‘వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మరోవైపు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అన్నగారిగా సంబోధించకుండా శుభాకాంక్షలు తెలిపారు.
“వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా, పవన్, షర్మిల ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: