
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయం తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.
Read also: Savitribai Phule: సావిత్రిబాయి పూలే జయంతి.. ప్రముఖులు నివాళులు
ఇప్పటికీ ఆశ్చర్యం
గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడరని గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో దీక్ష విరమణ మండపం, సత్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: