ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యం విషయంలో తాజా సమాచారం వెలువడింది. గత రెండు రోజులుగా ఆయన జ్వరం బారిన పడ్డారని సమాచారం. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.జ్వరం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అదేవిధంగా కొంతమంది అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ప్రజాసేవకుడిగా బాధ్యతలను నిర్వర్తించాలనే తాపత్రయం ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపించింది. అయితే వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం.

అభిమానుల ఆందోళన, శ్రేయోభిలాషుల ఆకాంక్షలు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఈ వార్త విని అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు పెడుతూ ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నారు. రాజకీయాలతో పాటు సినిమాలలోనూ వ్యస్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడడంతో అభిమానులు ఆయనను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ విడుదలకు సిద్ధంగా ఉంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
భారీ కటౌట్లు, ఉత్సాహంలో ఫ్యాన్స్
ఓజీ రిలీజ్ సందర్భంగా అభిమానుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకు మాస్ రెస్పాన్స్ ఎప్పటికీ ప్రత్యేకమైందే. ఈ సారి కూడా అదే హంగామా మొదలైందని చెప్పాలి.చిత్రబృందం రిలీజ్‌కు ముందు వరుస ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓజీ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. థియేటర్లలో టికెట్ బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయని సమాచారం.
సినిమా విజయంపై భారీ అంచనాలు
సినిమా టీమ్ ప్రమోషన్స్, అభిమానుల హుషారు, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఓజీ బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడినా కూడా ఆయన సినిమాపై ఉన్న హైప్ ఏ మాత్రం తగ్గలేదు. అభిమానులు ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడడం తోపాటు ఓజీ విజయం కోసం కూడా ప్రార్థిస్తున్నారు.
Read Also :