అమరావతి మహిళలపై (On the women of Amaravati) అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అమరావతిలోని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఘాటుగా స్పందించారు. మహిళలపై జర్నలిస్ట్ ముసుగులో చేసిన ఈ వ్యాఖ్యలు అసహనకరమని మండిపడ్డారు. “ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా వదిలిపెట్టబోం” అని ఆయన స్పష్టం చేశారు.
సాక్షి చానల్‌పై తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, సాక్షి మీడియా యాజమాన్యం బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నదని, ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. “కులముద్రలు వేసి మహిళలను అవమానించడం మానవత్వానికి వ్యతిరేకం” అని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు, ప్రజలు తీవ్రంగా పరిశీలించాలని సూచించారు.
చరిత్రను మరిచిన కామెంట్లు
అమరావతి ప్రాంతం ప్రాచీన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిందని పవన్ గుర్తు చేశారు. “ఇక్కడ బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. దీన్ని అవహేళన చేయడం క్షమించదగినది కాదు” అని అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చినవారిలో మేజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వ కఠిన నిర్ణయం
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. రైతులు, మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. 24 గంటల్లో క్షమాపణ లభించకపోతే, సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలు కలసి ఒకే మాట చెప్పారు – మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదలచుకోలేమన్నారు.
Read Also : Rain : జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..