ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26న కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించనుండటం స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి రైతులను పవన్ పరామర్శించనున్నారు.
Read Also: AP: రాష్ట్రంలో ఫిన్లాండ్ లోని ఆట ఆధారిత అభ్యాసం..’ ప్రయోగాత్మకంగా అమలు

కొబ్బరి రైతులకు భరోసా
దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.మొంథా తుఫాను తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పంట పునరుద్ధరణ ఖర్చులు గురించి, ఆయన (Pawan Kalyan) సమగ్రంగా అడిగి తెలుసుకోనున్నారు..
అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: