
చిత్తూరు జిల్లాలోని అటవీ భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కఠినంగా స్పందించారు. వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూములను అక్రమంగా ఆక్రమించారని ఆయన ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఏరియల్ సర్వేలో మొత్తం 76.74 ఎకరాల అటవీ భూమి ఆక్రమించబడిందని తేలింది. ఈ భూములకు పెద్దిరెడ్డి కుటుంబం సంబంధం ఉందని పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిపినట్లు కూడా నివేదికల్లో ప్రస్తావన ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read Also: Chandrababu: టూరిజం హబ్‌గా విశాఖ.. నావీ సహకారం కోరిన సీఎం

విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారి పేర్లు, కేసుల వివరాలు అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టంచేశారు.
అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి
సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్, “అడవుల్లో వారసత్వ భూములు ఎలా కలిగాయి?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అడవుల మధ్య ఉన్న భూమిని వారసత్వ ఆస్తిగా చూపడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూములు సర్వే నంబర్లు 295 మరియు 296లో ఉన్నాయని, రికార్డుల ప్రకారం భూమి విస్తీర్ణం 45.80 ఎకరాల నుంచి 77.54 ఎకరాలకు పెరిగిందని పవన్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెబ్‌ల్యాండ్ డేటాలో అసమానతలు ఉన్నాయని గుర్తించారు. విస్తీర్ణం పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందో వివరాలతో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “అటవీ భూములు దేశ సంపద. వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడం” అని పవన్ హెచ్చరించారు. సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని క్యాబినెట్‌కు సమాచారం అందించామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: