పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.
AP Govt: చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
విద్యార్థినులు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు అధికారులు తనకు వివరించారని పవన్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థినులలో ఒకరు ఇంటి వద్ద, మరొకరు ఆసుపత్రిలో వేర్వేరు రోజుల్లో మరణించినట్లు తెలిసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు.

మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న 37 మంది విద్యార్థినులకు విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) లో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని
బాధిత విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం (coalition government) తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.త్వరలోనే తాను స్వయంగా కురుపాం వెళ్లి గురుకుల పాఠశాలలోని పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: