చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan) కూటమి బలాన్ని స్పష్టంగా రుజువు చేశారు. రాష్ట్ర పురోగతికి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కలిసే పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నపాటి విభేదాలు వచ్చినా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, ప్రజల కోసం ఒకే ధోరణిలో ముందుకు సాగాలని సూచించారు. వ్యవస్థలు గత ప్రభుత్వం కాలంలో దెబ్బ తిన్నాయని, వాటిని మళ్లీ గాడిన పెట్టడం కూటమి బాధ్యత అని పేర్కొన్నారు.
Read also: Vande Bharat: ఏపీలో మరో వందేభారత్ రైలుకు హాల్ట్

Pawan Kalyan’s visit to Chittoor district
పరిపాలనలో మార్పుల దిశగా
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల పునరుద్ధరణకు కీలకమవుతాయని పవన్ కల్యాణ్ వివరించారు. పదోన్నతుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూసిన వేలాది ఉద్యోగులకు న్యాయం చేశామని గుర్తుచేశారు. అర్హత ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామని, ప్రభుత్వ సేవలో ఉన్నవారి కష్టాలు తనకు బాగా తెలుసని తెలిపారు.
అవినీతిపై పోరాటం
శేషాచలం అడవుల్లో జరిగిన అక్రమ కార్యకలాపలను పవన్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర సంపదను దోచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను బెదిరించి ఏకగ్రీవాలు చేయించిన పరిస్థితులను ప్రస్తావిస్తూ, అటువంటి పరిస్థితుల్లోనూ నిలబడ్డ జనసేన కార్యకర్తల ధైర్యాన్ని అభినందించారు. ప్రతి కార్యకర్త కృషిని గుర్తిస్తూ గ్రామం నుంచి లోక్‌సభ వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: