Nandyal district development : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఆయన, వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కోట్ల రూపాయల నిధులను సమీకరించారు. ముఖ్యంగా ఆయన అందించిన రూ.50 లక్షల విరాళంతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గ్రామంలో తాగునీటి సమస్యను గణనీయంగా తగ్గించనుంది.
2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం నియోజకవర్గ పర్యటనలో రూ.50 లక్షల విరాళం అందజేసి, గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2,000 మందికి సురక్షిత తాగునీరు అందనుంది. వేసవికాలానికి ముందే నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

గ్రామ అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద రూ.6 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ‘పల్లె పండగ 1.0’ ద్వారా అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తికాగా, ‘పల్లె పండగ 2.0’ కింద సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి పథకం కింద పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేశారు.
అదనంగా గోకులాల నిర్మాణం, గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు, నీటి సౌకర్యాలు, రైతులకు ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి, మైనర్ కాలువల పునరుద్ధరణ, కమ్యూనిటీ చెక్ డ్యామ్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టారు. గ్రామ ప్రజలు కోరిన అవసరాలను దశలవారీగా తీర్చుతూ కొణిదెలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: