ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా జగన్‌ను సూచించారు.
“వైసీపీకి వేరే రాజ్యాంగమా?” — పవన్ సూటీ ప్రశ్న
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాట్లాడుతూ, వైసీపీ నాయకత్వం రాజ్యాంగ వ్యవస్థను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
“బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉండొచ్చేమో కానీ, అది మన ప్రభుత్వంలో పని చేయదు,” అని పవన్ స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్య విలువలను గౌరవించడంలో ప్రతిపక్షం పాత్రను ప్రశ్నించనలసిన విషయమని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్‌డీ క్యాంపస్ ప్రతిపాదన
పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్‌డీ క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించాలన్న యోచన ఉందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తానని వెల్లడించారు.
కళలకు ప్రోత్సాహం — హింస తగ్గేందుకు మార్గం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
“సమాజంలో కళలకు సరైన స్థానం ఇవ్వకపోతే హింస పెరిగే ప్రమాదం ఉంటుంది,”
అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఎస్‌డీ క్యాంపస్ ఒక చిన్న భారతదేశంలా ఉందని అభిప్రాయపడ్డారు. తనకు శిక్షణ ఇచ్చిన గురువు సత్యమూర్తి ఎన్ఎస్‌డీ గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినిమా ప్రపంచ గుర్తింపు పొందింది
తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు, రాయితీలు వంటి అంశాలపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు.
ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్
పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొత్తగా నియమితమైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
“రాధాకృష్ణన్ అనుభవజ్ఞుడు. ఆయన నేతృత్వంలో రాజ్యసభలో సార్ధకమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నాను,” అని పవన్ అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: