అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
Read Also: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?
అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని పవన్ తెలిపారు. అదేవిధంగా, ఏజెన్సీలోని జలపాతాలు, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఎకో టూరిజం (Eco tourism)

ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి.అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: