ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉద్యోగులతో నేరుగా చర్చించేందుకు సిద్ధమయ్యారు. రేపు (బుధవారం) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ (పీఆర్), గ్రామీణాభివృద్ధి (ఆర్డీ) శాఖల ఉద్యోగులతో ‘మాటామంతీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read Also: CM Chandrababu: ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు

మెరుగైన సేవలు
ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన (Pawan Kalyan) వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ శాఖలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: