శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు.
రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ.. కారును ఢీకొని దుర్ఘటన
ఈ విషాదకర ఘటన రాంగ్ రూట్‌లో వస్తున్న టిప్పర్ లారీ ఓ కారును ఎదురెదురుగా ఢీకొట్టడం వల్ల చోటుచేసుకున్నదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వివరించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం అత్యంత విషాదకరమని తెలిపారు.

అధికారుల నుంచి వివరాలు.. ప్రభుత్వానికి సూచనలు
బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన పవన్, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు తనకు అందించారని తెలిపారు. “ఇలాంటి ఘటనల్లో బాధిత కుటుంబాలను ప్రభుత్వం మద్దతుగా నిలబెట్టుకోవాలి,”అని ప్రభుత్వాన్ని కోరారు.
ఇసుక, కంకర వాహనాలపై పవన్ ఆందోళన
ఇసుక, కంకర రవాణా చేసే వాహనాలు నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో నడపబడుతున్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.“ఇలాంటి వాహనాలు రూల్స్‌ను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్లలో నడుస్తుండటం ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అధికారులు అలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు పవన్ సానుభూతి
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి బాధను తాను హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటున్నానని, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండాలి అని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: