Parvathipuram: నలుగురికి తీవ్ర గాయాలు పార్వతీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : దీపావళి (Diwali) సందర్భంగా స్థానిక పుర ప్రజలందరూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుకోని సంఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే అకస్మాత్తుగా ఆదివారం సాయంత్రం విజయనగరం (vizianagaram) నుండి పార్వతీపురం వచ్చే బస్సులో బాణసంచా సామాగ్రిని పార్సెల్ రూపంలో ఏఎన్ఎల్ కొరియర్ పార్శిల్ సర్వీస్కు రవాణా చేయడం జరిగింది. బస్సు పార్వతీపురం చేరుకోగానే, ఎప్పటి క్రమంలో పార్శిల్ సర్వీస్ కేంద్రం వద్ద దింపగానే, హఠాత్తుగా ఓ పార్శిల్లో (బాణసంచా సామాగ్రి) పేలుడు సంభవించడంతో స్థానికులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి క్షతగాత్రులు స్థానిక మహంతి వీధి స్క్రాప్ కొట్టులో డ్రైవర్ కింతలిరమేష్(42), బస్సు డ్రైవర్ తెర్లి రవి(46)లను విశాఖపట్నం కెజిహెచ్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు.
Read also: Dialysis Centers : కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు – సత్యకుమార్ యాదవ్

Parvathipuram: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లోభారీ పేలుడు
నర్సిపురం రెడ్డి రమేష్ ఆర్టిసి కాంప్లెక్స్లోలో కళాసు, బోనేల సుందర్ ఉన్నారని తెలియ వచ్చింది. ఈ పార్సిల్ విజయనగరం నుండి పార్వతిపురంకి (Parvathipuram) బుక్ చేయడం జరిగింది. పార్సిల్ ను స్థానిక ఎఎన్ఎల్ సర్వీస్ వద్ద దించిన తర్వాత ఈ సంఘటన సంభవించింది. పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, సబ్ డివిజన్ అధికారి అంకిత సురానలతో కలిసి సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తు చేసి, ప్రజలు ప్రయాణించే బస్సులలో పార్సిల్ సర్వీసు ద్వారా నిషేధిత మందు గుండు సామాగ్రి బుక్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్షతగాత్రులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పరామర్శించి సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జరిగిన మందు గుండు సామాగ్రి పేలుడు సంఘటన దురదృష్టకరమని అన్నారు. పార్సిల్ సర్వీసులో ప్రమాదకరమైన మందు గుండు సామాగ్రి బుక్ చేయడం సరికాదని అన్నారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏమి జరిగింది?
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాణసంచా సామాగ్రి ఉన్న పార్శిల్ అకస్మాత్తుగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఎన్ని మంది గాయపడ్డారు?
ఈ పేలుడు ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: