నారుతోపాటు నీరు పోసే తీరుపైనే మొక్క ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. పిల్లల పెంపకం కూడా అంతే! చిన్నప్పటినుంచి వారితో తల్లిదండ్రులుగా, పిల్లల ఎదుగు దలలోని వివిధ దశల్లో ఎలా ప్రవర్తిస్తున్నామనే (Parental behavior) దాన్నిబట్టి వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మన పిల్లలు మొట్ట మొదటి సూపర్ హీరోల్లా ఆరాధించేది సూపర్ మ్యాన్, సూపర్ హీరోనో, స్పైడర్ మాన్నో కాదు.. తమ తల్లిదండ్రులనే. చిన్నారులు తొలుత ఎక్కువగా విశ్వసించేది, ప్రేమిం చేది తాము అనుకరించాలని కోరుకునేది కూడా వారినే. తల్లిదండ్రులు పరిపూర్ణ వ్యక్తులుగా వ్యవహరిస్తూనే, (Parental behavior) కన్న బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూవారితో గడిపేందుకు తరచూ సమయం కేటాయించుకుంటే చాలు. పిల్లలకు గొప్ప మేలు చేసినట్లేనని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రతి కుటుం బంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలాకీలకం, ఇది కాదనలేని వాస్తవం. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుందనేది నిజం. కానీ ఆధునిక టెక్నాలజీ మారుతున్న సామాజిక పరిణామాలు, ఆర్థిక పరిస్థితుల ప్రభావం తదితరాల మూలంగా తల్లిదండ్రుల భావోద్వేగాల ప్రతికూల ప్రభావం, తరచూ గొడవలు పడడం మూలంగా పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎదిగే వయసులో వారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో పిల్లలు పెద్దవారయ్యాక కూడా తల్లిదండ్రులు ప్రవర్తనలో మార్పులు రాకపోవడం. అదే తరహా గొడవలు వాదోపవాదాలు ఎదిగిన పిల్లల ముందు పెట్టడం మూలంగా యువతరం భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు.
Read Also: http://Narayana Murthy: దేశాభివృద్ధికి 72 గంటలు చాలు: మూర్తి

ఒక వయసు వచ్చి చదువు పూర్తయి పరీక్షలకు సన్నద్ధం కావటమో, ఉద్యోగాలు, వ్యాపారం వంటివి చేస్తున్న పిల్లలకు తల్లిదండ్రులు తగులా టడం అనేది వారి సంతతికి ఆధునిక సమస్యగా పరిణమిం చింది. అలాంటి సందర్భాల్లో గొడవలు ఆపాలని ప్రయత్నించినా తల్లిదండ్రులు వినకపోవడం, తిరిగి వారి ఎదిగిన పిల్ల లనే నిందించడం వంటివి చేస్తున్నారు. ఉద్యోగం, పెండ్లి, భవిష్యత్తు వంటి అనేక బాధ్యతలు మీద పడుతున్న సమ యంలో ఇలాంటివి దేశంలోని పలు కుటుంబాల్లో యువతి, యువకులకు ఇబ్బందికరంగా మారాయని మానసిక నిపు ణులు అంటున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడి గురవు తున్నారని చెప్తున్నారు. పిల్లలు పెద్దవారయ్యాక కూడా తల్లిదండ్రుల మధ్య గొడవలను చూసి పెరిగిన కారణంగా వారిలో కలిగే బాధ, ఆందోళన, దుఃఖము వంటివి తగ్గిపోవు. తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవల్లో పిల్లలు పావులుగా చిక్కుకపోతున్నారు. ఇద్దరినీ సముదాయించాలని వారు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పంతాలకుపోవడం కారణంగా పిల్లలకు ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి నెలకొంటున్నాయి. ఇలా పిల్లలే మధ్య వర్తులుగా మారుతున్న సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను పక్షపాతం వహిస్తున్నవంటూ తిరిగి తల్లిదండ్రులే పిల్లలను ఆరోపిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. ఇలాంటి స్థితి పిల్లల, ఎదుగుతున్న యువత మానసిక భావోద్వేగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దేశంలోని మెజార్టీ యువత ఇదే అనుభవాలను ఎదురొ్కంటుందని మానసిక వైద్యులు చెప్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు విలువలు బోధించాలి. ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించాల్సిన విషయం ఏమంటే? గొడవలు ఆపాలన్న మధ్యవర్తి పాత్ర పిల్లల బాధ్యత కాదన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు తల్లిదండ్రుల నుంచి సంస్కారం నేర్చుకోవాలి. మరోవైపు పలువురు తల్లిదండ్రులకు కూడా పిల్లలకు మంచి, చెడు చెప్పే సమయం ఉండటం లేదు. విలువల గురించి మాట్లాడుకోవడం కష్టమయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న పిల్లలు దారి తప్పుతున్నారు. పరిస్థితి చేయి దాటిన తరువాత తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అందుకే పిల్లల పెంపకం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. విలువలు పాటించాలి, పిల్లలకు బోధించాలి. ఇంట్లో ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటుందో అప్పుడు పిల్లల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అభద్రతా భావం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆస్తులు వారి సంతానమే. ఆ పిల్లలను సమాజంలో సంస్కా రవంతులుగా, ఉన్నత స్థాయిలో ఎదగాలంటే.. ఆస్తులు కాదు? విలువలను ఇచ్చే విద్యతో పాటు కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తనే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ఎదగడానికి
తోడ్పడుతుందని నేటితరం భావించాల్సిన అవసరం ఎంతో ఉంది.
-మేకిరి దామోదర్
తల్లిదండ్రుల ప్రవర్తన నిర్వచనం ఏమిటి?
తల్లిదండ్రుల ప్రవర్తన అనేది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారో, వారి వైఖరులను మరియు పరస్పర చర్యలను సూచిస్తుంది. ఇది తల్లిదండ్రుల శైలులు, క్రమశిక్షణా వ్యూహాలు, భావోద్వేగ మద్దతు మరియు కమ్యూనికేషన్ విధానాలు వంటి వివిధ అంశాలను కలిగి ఉంటుంది.
పేరెంటింగ్‌లో ABC పద్ధతి ఏమిటి?
పేరెంటింగ్‌లో ABC పద్ధతి – అట్యూన్‌మెంట్, బ్యాలెన్స్ మరియు కనెక్షన్ – భావోద్వేగ అవగాహనను పెంపొందించడం మరియు తల్లిదండ్రులు-పిల్లల సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా తల్లిదండ్రుల ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: