పాపికొండల Papikondalu సుందర విహారయాత్ర మళ్లీ సందడిగా మారింది. గోదావరి నదిలో Godavari River మూడు నెలల విరామం తర్వాత బోటింగ్ Boating సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. జూలై 11న వరదలు తీవ్రరూపం దాల్చడంతో భద్రతా కారణాల దృష్ట్యా బోటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు వరద ముప్పు పూర్తిగా తగ్గడంతో, అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి యాత్ర పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చారు. రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. బోటింగ్ ప్రారంభంతో పర్యాటకులు, నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
AP Weather:ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

Papikondalu
యాత్ర పునఃప్రారంభం
ఇదే సమయంలో తెలంగాణ Telangana నుంచి వచ్చే పర్యాటకుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోచారం ఫెర్రీ పాయింట్ నుంచి బోటింగ్ సేవలను త్వరలో Papikondalu ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన పాపికొండల ప్రాంతం మళ్లీ పర్యాటకులతో కళకళలాడే అవకాశం ఉంది. ఈ యాత్ర పునఃప్రారంభం స్థానిక పర్యాటక రంగానికి ఊపునిచ్చే అవకాశం ఉందని బోటు నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: