हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest Telugu News : Panchayat : వ్యవస్థపై అవగాహన తప్పనిసరి!

Sudha
Latest Telugu News : Panchayat : వ్యవస్థపై అవగాహన తప్పనిసరి!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల సమరం ఊపందుకుంది. ఐనవారి మధ్య జరిగే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో లక్షలు వెచ్చించి వేలం వేసి ఏకగ్రీవం అవడం, అమెరికా నుండి వచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం, ఒకే పంచాయితీలో తల్లి బిడ్డలు, అన్న చెళ్లలు, అత్త, కోడళ్లు పోటీ పడడం, పదవీకాలంలో ఎక్కువ ఆస్తులు సంపాదించినట్లైతే అవి పంచాయితీ (Panchayat)కే అని బాండ్ పేపర్ రాయడం, ఉన్నత ఉద్యోగాలకు రాజీనామా చేసి పంచాయితీ (Panchayat)పోటీల్లో పాల్గొనడం వంటి సంఘటనలు చూస్తున్నాం. పదవిమీద వ్యామొహమో, రాజకీయ రంగం లో తొలిఅడుగులు వేయాలనే ఆసక్తేమో కానీ పంచాయితీఎన్నికల పరంపర రసవత్తరంగా సాగుతుంది. కానీ అభ్యర్థు లు పోటీపడడమే కాకుండా పంచాయితీరాజ్ వ్యవస్థపై, విధులు, నిధులపై సమగ్ర అవగాహన ఉంటేనే గెలిచాక పాలన సుగమం అవుతుందనేది గమనించాలి. అలాగే అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ప్రజలకు కూడా పంచాయితీరాజ్ వ్యవస్థపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామ ప్రథమ పౌరుడి విధులలో, గ్రామం లో సూపరిపాలన అందించడం, త్రాగునీటి, పారిశుధ్యం, రోడ్లు, విద్యుదీకరణ వంటి కనీస అవసర సేవలనిర్వహణ, గ్రామసభకు అధ్యక్షత వహించి సభలను విజయవంతం చేయడం, గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చడం, పన్నుల సేకరణ, నూతన ఆదాయవనరులను సృషంచడం, గ్రామ అభివృద్ధి పనుల నిర్వహణ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉద్యోగ అవకాశాల కల్పన, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, కేంద్ర, రాష్ట్ర నిధులను గ్రామానికి పన్నులు ఇతరత్రా ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం, ప్రజల సంక్షేమానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించి గ్రామంలో శాంతియుత వాతా వరణ నెలకొల్పడం, గ్రామీణ వనరులను, నిధులను సమర్థ వంతంగా వాడుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం, గ్రామ రికార్డులను, లెక్కలను నిర్వహించడం. గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలను పర్యవేక్షించడం, పథకాల అమలులో, అభివృద్ధిలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయంగా ఉండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడపాలి.

Read Also: HYD: ఒక్క రూపాయికే టిఫిన్.. ఎక్కడో తెలుసా?

Panchayat
Panchayat

గ్రామ్ స్వరాజ్ పోర్టల్

కేంద్రం గ్రామ పంచాయతీలకు పథకాల ద్వారా జమ అయిన ఖర్చులలో పారదర్శక ప్రదర్శించడానికి ప్రవేశపెట్టిన ఇ గ్రామ్ స్వరాజ్ పోర్టల్, మేరి పంచ యాత్ యాప్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే గ్రామ పంచాయితీ నిధుల విషయానికొస్తే గ్రామపంచాయి తీలకు నిధులు ప్రధానంగా గ్రామ పంచాయితీ పన్నుల, ఇతర భవనాలు, మార్కెట్ యార్డు, సంతలు అద్దెకు ఇవ్వ డం ద్వారా వచ్చే స్వీయ ఆదాయం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులనుండి వస్తాయి. 15వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 వరకు ప్రతి సంవత్సరం రెండు విడుతలుగా (మొదటి విడుత జూన్లో, రెండవ విడత అక్టోబర్లో) పంచాయితీలకు నిధులను విడుదల చేస్తుంది. వీటిలో 85 శాతం గ్రామాలకు, 10 శాతం మండల పంచాయితీలకు, 5 శాతం జిల్లా పంచాయితీలకు వాడుకుంటారు. అందులో జీతభత్యాలు గాక 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 అంశాల నిర్వహణకు అన్ టైడ్ ఫండ్ రూపంలో అందితే, అత్యవసర అవసరాలకు త్రాగునీటి సరఫరాకు, పారిశుధ్య నిర్వహణకు టైడ్ ఫండ్రూ పంలో విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం15వ ఆర్థిక సంఘం 2021-22 నుండి 2025 – 26 కాలానికి 7201 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి కేటా యిస్తే అందులో ఈ ఆర్థిక సంవత్సరానికి 2025-26కు గాను 1477కోట్లుగా కేటాయించింది. రాష్ట్రప్రభు త్వం వార్షిక బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అవసరాలకనుగుణంగా విడుదల చేస్తుంది. వీటితో పాటు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ జీవన మిషన్, మహాత్మ గాంధీ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్, నేషనల్హె ల్త్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామీణ్ అవాస్ యోజన వంటి పథకాలతో కొన్ని నిధులు అందుతున్నాయి.

జాతీయ పంచాయితీ అవార్డులు

భారత ప్రభుత్వ పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ, జాతీయ పంచాయితీ అవార్డులను ఉత్తమ గ్రామాలకు ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తుంది. ఇది సూచించిన ముఖ్యమైనఅంశాలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే గ్రామపంచాయితీలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో పేదరిక నిర్మూ లన, మెరుగైన జీవన విధానం, ఆరోగ్యకర గ్రామ పంచాయితీ, పిల్లల హక్కులు, విద్య, వైద్యం మహిళల రక్షణ, సాధికారత, త్రాగునీటి పారిశుధ్య నిర్వహణ, స్థిరమైన మౌలిక సదుపాయాలు కల్పన, గ్రామ పంచాయితీల సామా జిక సురక్షిత, ప్రజలకు అందించే సుపరిపాలన అనే 9 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటూ మెరుగైన ప్రగతిని సాధించిన గ్రామ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులను ఇస్తారు. పైన పేర్కొన్న అంశాలలో ప్రతి అం శంలో ప్రథమ స్థానంలో నిలిచిన 3 గ్రామ పంచాయతీలకు దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్సతత్వి కాస్ పురస్కార్ ను అందిస్తుంది. పై 9 అంశాలలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన 3 గ్రామ పంచాయితీలకు, 3 మండల పంచా యితీలకు, 3 జిల్లా పంచాయితీలకు నానాజీ దేశముఖ్ సర్వో త్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ను అందిస్తుంది. ఇవేకాక కొన్ని ప్రత్యేక విభాగాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వాడకం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ పున రుత్పాదక ఇంధన వనరులను వాడి గ్రామాన్ని కర్బన రహితంగా చేయడంలో కృషి చేసిన గ్రామాలకు క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ అవార్డు, సొంత వనరులతో గ్రామ ఆదాయాన్ని పెంచే గ్రామ పంచాయితీలకు ఆత్మనిర్భన్ పంచాయత్ స్పెషల్ అవార్డు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో సంస్థాగత సహకారం అందించే గ్రామపంచాయితీలకు గ్రామ్ పంచాయత్ క్షమతా నిర్మాన్ సర్వోత్తమ్ సంతాన్ పురస్కార్ అవార్డులు ప్రతి సంవత్సరం జాతీయ పంచాయి తీ రాజ్ దినోత్సవం రోజున ప్రధాన చేస్తారు.

Panchayat
Panchayat

ఆత్మనిర్భన్ పంచాయత్

2025 సం వత్సరం జాతీయ ప్రత్యేక అవార్డుల విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం ‘మల్ గ్రామపంచాయతీ 67 లక్షలు వారాంతం జరిగే పశువుల సంత నిర్వహణ ద్వారా, 3.75లక్షలు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెల ద్వారా, విద్యుదీకరణ, పారిశుధ్య పన్నుల ద్వారా మొత్తంగా 3200 జనాభాకు తలసరి ఆదాయంగా సుమా రు 2954 రూపాయలు స్వీయ ఆదాయాన్ని సమకూర్చి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తూ ఆత్మనిర్భన్ పంచాయత్ స్పెషల్ అవార్డు 2025కు ఎంపికైంది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో గెలుపు కోసం పోటీ పడిన్నట్టుగానే గెలిచిన తరు వాత తమ పంచాయితీలను ఉత్తమంగా తీర్చిదిద్ది దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో పోటీ పడాలి. ప్రజలు కూడా డబ్బు, మందు వంటి తాత్కాలిక ప్రయోజనాలకు ఆకర్షణ కాకుండా ఐదు సంవత్సరాలు గ్రామ భవిష్యత్తుకు విధులు సక్రమంగా నిర్వర్తించే, నిధులను సమర్థంగా ఉపయోగించే, గ్రామ సమస్యలపై పోరాడే అర్హత గల నాయ కత్వాన్ని ఎన్నుకోవాలనే ఆలోచన చేయాలి. అప్పుడే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం దక్కుతుంది.
– బైరబోయిన వెంకటేశ్వర్లు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870